పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచి పోరాడుతున్నాం: టీఎస్‌ఎఫ్‌సీసీ కార్యదర్శి
- సింగిల్ స్క్రీన్ పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతలు
- గత సంవత్సరం కూడా పర్సంటేజీ విధానం గురించి అడిగామన్న శ్రీధర్
- రెండు నెలల్లో చర్చిద్దామని చెప్పి జాప్యం చేశారని వ్యాఖ్య
పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచి పోరాడుతున్నామని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ వెల్లడించారు. సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ విధానాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్లు కోరుతుండగా, నిర్మాతలు మాత్రం అది కష్టమని చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ క్రమంలో తాజాగా, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురువారం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో భాగంగానే మొన్న ఎగ్జిబిటర్ల మీడియా సమావేశం జరిగిందని అన్నారు. పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచి పోరాడుతున్నామని అన్నారు. గత ఏడాది కూడా దీని గురించి అడిగామని, అయితే 'హరిహరవీరమల్లు' విడుదల సమయంలో ఇలా చేయవద్దని తమకు సూచించారని అన్నారు. రెండు నెలల్లో ఈ విషయంపై చర్చిద్దామని చెప్పారని వెల్లడించారు.
కానీ నెలలు గడుస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. అందుకే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నామని శ్రీధర్ తెలిపారు. 'పెద్ది' సినిమా ప్రస్తావన తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. నిర్మాతలు అటు తిప్పి, ఇటు తిప్పి ఈ చిత్రం ప్రస్తావన తీసుకువచ్చారని అన్నారు. ఈ చిత్రంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కొందరు నిర్మాతలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.